క్రైమ్/లీగల్

వీడిన హత్య కేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల/పరిగి, ఫిబ్రవరి 18; కులకచర్లకు చెందిన భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రవి మృతిపై నెలకున్న మిస్టరీని రక్షకభటులు ఛేదించారు. పరిగిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో పరిగి మండలం నజీరాబాద్‌కు, కప్లపురం గ్రామానికి చెందిన రెండు లారీలు అతి వేగంగా నంచర్ల వైపు నుంచి పరిగి వెళ్తుండగా, కులకచర్లలో బీజేవైఎం నాయకుడు గుడాల రవి ఎందుకిలా ఇంత వేగంగా వెళ్తున్నారని అరవడంతో ఇది విన్న ఛోదకులు.. వాహనాన్ని నడుపుతూనే దుర్భాషలాడారు. ఇది విన్న రవి ఒక్కసారిగా రగిలిపోయి వెంటనే ద్విచక్ర వాహనాన్ని తీసుకుని వెంబడించి కామునిపల్లె శివార్లలో ఆపి లారీ ఛోదకులతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదంలోనే ఇరువురు ఛోదకులు దిగి రవిని బాగా చితకబాది లారీలతో ఢీకొట్టి హతమార్చారని నిర్దారించారు. ఇరువురు లారీ ఛోదకులతో పాటు సమాచారాన్ని రహస్యంగా ఉంచేయత్నానికి పాల్పడిన లారీ యజమానులైన శీను, తావుర్యపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. లారీలు రెండు ఢీకొడితే మృతుడు రహదారిలో కాకుండా రహదారి కిందివైపు ఎందుకున్నట్లు అని విలేఖరులు ప్రశ్నించడంతో వారివైపు నుంచి సరైన సమాధానం లభించలేదు. రవిని లారీ ఛోదకులు హతమార్చారని, ఛోదకులైన పాత్లావత్ శంకర్, పాత్లావత్ శీనుపై హత్యా కేసును నమోదు చేసినట్లు తెలిపారు. పరిగిలోని సీసీ కెమెరాల ఆధారంగా కేసును 24 గంటల్లో ఛేదించినట్లు తెలిపారు. పరిగి వలయాధికారి రంగాను, కులకచర్ల ఎస్‌ఐ చంద్రకాంత్, పరిగి ఎస్‌ఐను అభినందించారు.