క్రైమ్/లీగల్

కాంట్రాక్టు వైద్యులకు వెయిటేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల రిక్రూట్‌మెంట్‌లో వెయిటేజీ ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసిన కాలానికి ఈ వెయిటేజీ ఇస్తామని అన్నారు.
టిటిడి సీనియార్టీ లిస్టు కొట్టివేత
టిటిడి రూపొందించిన ఉద్యోగుల సీనియార్టీ లిస్టును హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. పదోన్నతులకు టిటిడి రూపొందించిన జాబితాను జస్టిస్ ఎం ఎస్ రామచంద్రరావు కొట్టివేశారు. తదుపరి విచారణను ఆరు వారాలు వాయిదా వేశారు.
వాకపల్లి కేసు విచారణ నుండి తప్పుకున్న ఎసిజె
వాకపల్లి కేసు విచారణలో భాగంగా పి త్రినాధరావును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించే అంశంపై హైకోర్టులో కేసు విచారణకు వచ్చినపుడు దాని విచారణ బాధ్యతల నుండి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ తప్పుకున్నారు. గతంలో త్రినాధరావుతో కలిసి తాను ఒక కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ కేసును మరో బెంచ్‌కు పోస్టు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
ఇడి ఆదేశాల రద్దుకు తిరస్కరణ
బి రామలింగరాజు కుమారుడు బి తేజరాజుకు చెందిన విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఇడి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేందుకు హైకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.