క్రైమ్/లీగల్

అవినీతి కేసులో సర్వే, ల్యాండ్ రికార్డ్సు డిప్యూటీ సర్వేయర్‌కు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: అవినీతి కేసులో నిందిత అధికారికి ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ల్యాండ్ రికార్డ్సు విభాగంలో పని చేసే డిప్యూటీ సర్వేయర్ ఎడ్ల పోచయ్య రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు. మద్దికుంటకు చెందిన కె.నరేందర్ తన వ్యవసాయ భూమిని సర్వే చేసేందుకు అధికారిని కలుసుకోగా రూ.6 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఎసిబిని ఆశ్రయించగా, రెండ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగగా ఈ నెల 16న కరీంనగర్ ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్ధానం నిందితుడైన అధికారికి జైలు శిక్ష, జరిమాన విధించిందని ఎసిబి కార్యాలయం తెలిపింది.