క్రైమ్/లీగల్

క్రికెట్ బుకీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 4: ప్రొద్దుటూరు పట్టణంలోని టౌటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక క్రికెట్ బుకీ, గంజాయి నిర్వహుడిని అదుపులోనికి తీసుకున్నామని అర్బన్ సీఐ సదాశివయ్య తెలిపారు. స్థానిక టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పాంగరంగస్వామి దేవస్థానం వీధిలో ఉండే షేక్ షారుక్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్, గంజాయి విక్రయం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో తాను, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఫణీంద్ర, టూ టౌన్ ఎస్సై మధుమల్లేశ్వరరెడ్డి, రాజశేఖర్, సిబ్బంది కలిసి దాడిచేసి అతని నివాసంలో ఇండియా వర్సస్ సౌతాఫ్రికా 2వ వన్‌డే మ్యాచ్‌కు సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అతనిని అదుపులోనికి తీసుకున్నామని, అదేవిధంగా అతను గంజాయి విక్రయిస్తున్నారని తెలియడంతో ఇంటిలో సోదాలు నిర్వహించామని వివరించారు. అతని వద్ద నుండి 6 సెల్‌ఫోన్లు, ఒక క్రికెట్ బెట్టింగ్ స్లిప్, 1,70,700 రూపాయల నగదు, టీ.వీ., నాలుగు కేజీల గంజాయి, గంజాయి అమ్మగా సంపాదించిన రూ.30,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.