క్రైమ్/లీగల్

ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త కథనం ద్వారా పరువు నష్టం కల్గించారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేయగా తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది జయంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ పిటిషన్‌లోని అంశంతో పిటిషన్‌దారుకు సంబంధం లేదని హైకోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. ప్రధానిని కలిసిన సందర్భంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్ర సమస్యలను వివరించగా ఆ పత్రిక మాత్రం అందుకు విరుద్ధంగా జగన్‌మోహన్‌రెడ్డి సొంత కేసులను పరిష్కరించుకునేందుకు కలిశారంటూ ప్రచురించిందని వాదించారు. ఈ సమయంలో జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ వీటిని ఎవరు పట్టించుకుంటారని, ఇందులో పరువు నష్టం ఏముంది అని పేర్కొంటూ పిటిషన్‌ను తోసివుచ్చారు.