క్రైమ్/లీగల్

ఇక ఉరికంబమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన 23ఏళ్ల మెడికో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య పైశాచిక కృత్యంలో దోషలకు ఉరిశిక్ష ఖరారైంది. ఇప్పటికే మరణ శిక్ష ఎదుర్కొంటున్న నలుగురిలో ముగ్గురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. మరణ శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలంటూ దోషులు చేసిన వాదనలో ఎలాంటి పస లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. మరణ శిక్ష ఎదుర్కొంటున్న మొత్తం నలుగురు దోషుల్లో ముగ్గురు (ముఖేష్, పవన్ గుప్త, వినయ్ శర్మ) దాఖలు చేసిన ఉపశమన అభ్యర్థన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచి తిరస్కరించింది. నాలుగో దోషి అయిన అక్షయ్‌కుమార్ సింగ్ తన మరణ శిక్షను సవాలు చేయకపోవడం గమనార్హం. గత ఏడాది మే ఐదోతేదీన మరణ శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని, ఈ ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఇందుకు సంబంధించి బలమైన కారణాలు ఏమీ లేవని తేల్చిచెప్పింది. ‘గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన మరణ శిక్ష తీర్పులో ఏ రకమైన తప్పిదాన్ని ఈ ముగ్గురు దోషులు చూపించలేక పోయారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ ముగ్గురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విస్తృత స్థాయి విచారణ జరిగింది. మరణ శిక్ష తీర్పును సమీక్షించాల్ని బలమైన కారణాలు ఈ వాదనల్లో ఏ కోశానా కనిపించలేదు’అని న్యాయమూర్తులు ఆర్.్భనుమతి, అశోక్ భూషణ్‌లు సభ్యులుగా ఉన్న సుప్రీం బెంచి తెలిపింది. దోషుల వాదనల్లో ఎలాంటి పస లేకపోవడం, తీర్పును సమీక్షించాల్సిన అవసరమూ కనిపించక పోవడంతో వీరి పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. నిర్భయ కేసులో దోషిగా ఉన్న రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన మరణ సమయంలో నిర్భయ సంకేత ప్రాయంగానూ ఇతరత్రా ఇచ్చిన వాంగ్మూలాలూ నిజమైనవని,
స్వచ్చందమైనవని, ఎలాంటి తేడా ఉన్నవి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా వీటినే ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, గత ఏడాది సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకున్నాయని, దోషులు మళ్లీ వాటినే ప్రస్తావింల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మరణ వాంగ్మూలాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను గత ఏడాదే సుప్రీం కోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పస లేకపోవడంతో తిరస్కరించిందని న్యాయమూర్తులు తమ తాజా తీర్పులో ఉద్ఘాటించారు. ఇప్పటికే తేల్చేసిన అంశాల్ని పిటిషనర్లు పదేపదే లేవనెత్తజాలరని కూడా స్పష్టం చేశారు.
పారా మెడిక్ విద్యార్థిని అయిన 23 సంవత్సరాల నిర్భయపై 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఢిల్లీలోని ఓ బస్సులో అత్యంత పైశాచికంగా ఆరుగురు సామూహిక మానభంగం చేసి తీవ్రంగా గాయపరిచి ఆమెను నడుస్తున్న బస్సు నుంచే తోసేశారు. 2012 డిసెంబర్ 29న నిర్భయ తీవ్ర గాయాలతో సింగపూర్‌లోని వౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రిలో మరణించింది. ఈ రాక్షస కృత్యానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేన్న ప్రజా గర్జన దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మార్మోగింది. మొదట ట్రయల్ కోర్టులోనూ, అనంతరం ఢిల్లీ హైకోర్టులోనూ నిర్భయ నిందితుల కేసు విచారణకు వచ్చింది. వీరికి మరణ శిక్షను విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. దిగువ కోర్టులు ఇచ్చిన మరణ శిక్ష తీర్పును ధృవీకరిస్తూ గత ఏడాది మే 5న సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. సామూహిక అత్యాచార ఘాతుకంతో ప్రమేయం ఉన్న ఓ మైనర్‌కు బాల నేరస్థుల కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. అనంతరం ఆ మైనర్ విడుదలయ్యాడు. దోషులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు నిర్భయపై జరిగిన ఘాతుకాన్ని అత్యంత హేయమైనదిగా, పైశాచికమైనదిగా మొత్తం సభ్య సమాజాన్ని కకావికలు చేసే భయానక సునామీగా అభివర్ణించింది. అంతే కాదు నిర్భయను ఆ పైశాచిక మూక ఆనందాన్ని, తాము ఇష్టారాజ్యంగా ఛిద్రం చేసే ఆటబొమ్మగా పరిగణించారని కూడా తీవ్ర పదజాలంతో సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పులో పేర్కొంది. దోషులందరూ తమ పైశాచిక వాంఛ తీర్చుకోవడానికి ఆటవిక, పశుత్వ లక్షణాలు కలిగిన నేరానికే పాల్పడ్డారని కూడా సుప్రీం తెలిపింది.
*
‘సుప్రీం తీర్పు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతటితో మా పోరాటం ఆగినట్టు కాదు. ఎలాంటి జాప్యం లేకుండా దోషులకు సాధ్యమైనంత త్వరలో ఉరిశిక్ష అమలు చేయాలి. ఆ విధంగా సమాజంలోని యువతులు, మహిళలకు ధీమా కలిగించాలి’
-నిర్భయ తల్లి ఆశాదేవి
*
‘అత్యాచార దోషులకు మరణ శిక్ష విధించడం వల్ల మహిళలపై దాడులను అరికట్టలేం. కఠిన శిక్షల వల్ల లైంగిక దాడులు ఆగిన దృష్టాంతాలూ లేవు. చట్టాల్ని కఠినంగా అమలు చేయాలి. అన్ని కేసుల్లోనూ న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి’
-అమ్నెస్టీ ఇంటర్నేషనల్
*

చిత్రాలు..ముఖేష్ సింగ్ *అక్షయ్‌కుమార్ *వినయ్ శర్మ * పవన్ గుప్త