క్రైమ్/లీగల్

యూపీ జైల్లో గ్యాంగ్‌స్టర్ మున్నా భజరంగీ కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్‌పట్ (యూపీ): పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రేమ్‌ప్రకాష్ సింగ్ అలియాస్ మున్నా భజరంగిని ఇక్కడి జిల్లా జైలులో తోటి ఖైదీ ఒకరు సోమవారం కాల్చి చంపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యూపీ యోగి ఆదిత్యనాథ్ వెంటనే దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ నలుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. జాన్సీ జైలు నుంచి ఆదివారమే ఈ జైలుకు వచ్చిన భజరంగిని బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే లోకేష్ దీక్షిత్‌ను డబ్బు కోసం బెదిరించాడన్న కేసులో సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. అలాగే అతను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను తన సహచరునితో కలిసి కాల్చి చంపాడన్న కేసును సైతం ఎదుర్కొంటున్నాడు. ఇలావుండగా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో తన భర్త భజరంగిని హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని అతని భార్య ఆరోపించింది. ఈ సంఘటనపై జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరుపుతామని, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. జైలర్ ఉదయ్ ప్రతాప్, డిప్యూటీ జైలర్ శివాజీ యాదవ్, హెడ్ వార్డెన్ అర్జిందర్ సింగ్, వార్డెన్ మాధవకుమార్‌లను సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు.

చిత్రం..ప్రేమ్‌ప్రకాష్ సింగ్ మృతదేహాన్ని చూసేందుకు మార్చురీకి వచ్చిన కుటుంబసభ్యులు