క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో కాకినాడ ఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 10: కొత్తగా నిర్మించిన తక్కువ ఇంటికి పన్ను వేస్తానని ఇంటి యజమాని నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆదిశేషయ్యను మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని జగన్నాథపురం, 23వ డివిజన్‌లోని అగ్రహారానికి చెందిన హెచ్ చంద్రవౌళి అనే వ్యక్తి తన పాత ఇంటిని కూల్చివేసి, ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆదిశేషయ్య ఇంటిని పరిశీలించి, అవసరమైన అన్ని రకాల కొలతలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం అధికంగా ఇంటి పన్ను విధించాల్సి వస్తుందని చెప్పారు. పన్ను తగ్గించి వేయాలంటే రూ.20వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి తొలుత అంగీకరించని చంద్రవౌళి తర్వాత రూ.15 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం చంద్రవౌళి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం మేరకు చంద్రవౌళి నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసివున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు ఆదిశేషయ్యను రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ పి సుధాకర్ చెప్పారు.
ఆదిశేషయ్యతో పాటూ వెళ్ళిన బిల్లు కలెక్టర్ శివకుమార్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.