క్రైమ్/లీగల్

ఇదేం తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: పేరుకున్న చెత్త గుట్టల మధ్య ఢిల్లీ సమాధి అవుతోందని, వర్షపునీటిలో ముంబయి మునిగిపోతోందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ రాష్ట్రాల పరిధిలో ఘన వ్యర్థపదార్ధాల యాజమాన్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్లను దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పది రాష్ట్రాలకు , రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీహార్, చత్తీస్‌ఘడ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్నాటక, మేఘాలయ, పంజాబ్, లక్ష్యదీవులు, పుద్దుచ్ఛేరి రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై రూ.1 లక్ష చొప్పున జరిమానాను విధించారు. సిక్కిం, ఆస్సాం, ఉత్తరప్రదేశ్, మణిపూర్, తెలంగాణ,
దామన్ డయ్యూ రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నట్లు ఆ రాష్ట్రాల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హర్యానా, జార్కాండ్, ఒడిశా, నాగాలాండ్, దాద్రానగర్ హవేలి, అండమాన్,నికోబార్ దీవులు అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఇవి కాకుండా మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున జరిమానాను విధించింది. తమ వాదనలను వినిపించేందుకు కోర్టుకు న్యాయవాదులను కూడా పంపని రాష్ట్రాలకు ఈ జరిమానాను విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అఫిడవిట్లు దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అప్పుడు కూడా స్పందించని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలుజారీచేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
పేరుకుపోతున్న చెత్త, చెదారం ఏరివేతకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నామని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకుని ప్రజారోగ్యం పరిరక్షణ దృష్ట్యా ఆదేశాలు ఏమైనా ఇస్తే, న్యాయ క్రియాశీలత అంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని ఓక్లా, భుల్సావా, ఘాజీపూర్ చెత్త చెదారం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిందని, దీనికి బాధ్యులెవరనే అంశంపై బుధవారం లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. చెత్తా, చెదారం మధ్య ఢిల్లీ కూరుకుపోతోందని, వర్షం నీటిలో ముంబాయి మహానగరం మునుగుతోందని, దీనికి ఎవరు బాధ్యులని ప్రభుత్వాలు అంటీఅంటనట్లు ఉంటే ఎలా అని కోర్టు చురకంటించింది. మొత్తంపైన 13 రాష్ట్రాలు, ఇతర యూటీ ప్రాంతాలు అఫిడవిట్లు దాఖలు చేయలేదని కోర్టు పేర్కొంది. 2016 ఏప్రిల్ 8వ తేదీన ఘన వ్యర్థ పదార్థాల యాజమాన్య నిర్వహణపై విధి విధానాలు అమలు లోకి వచ్చాయని, రెండేళ్లు గడచినా, రాష్ట్రాలు స్పందించకపోవడం జవాబుదారీతనం లేకపోవడమే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది.