క్రైమ్/లీగల్

సాంస్కృతిక శాఖలో నియామకాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: సాంస్కృతిక శాఖలో ఇటీవల జరిగిన నియామకాలను రద్దుచేసి, పునర్నియమించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది. సాంస్కృతిక శాఖలో నియామకాలు మళ్లీ జరపాలని హైకోర్టు పేర్కొంది. సాంస్కృతిక శాఖలో జరిగిన నియామకాలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగా లేవని తెలిపింది. రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, మూడు వారాల్లో ఆ నియామకాలు చేపట్టాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
పారదర్శకంగానే చేపట్టాం: బాలకిషన్
సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగానే జరిగాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ సైతం ఆమోదించిందని సాంస్కృతిక సారధి రసమయి బాల కిషన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని నియామకాలు చేపడతామని ఆయన చెప్పారు.
ఏసీబీ కోర్టులో లొంగిపోయిన ప్రెసైడింగ్ ఆఫీసర్
మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల కాంప్లెక్స్‌లోని ల్యాబర్ కోర్టు ప్రెసైడింగ్ ఆఫీసర్‌గా ( జిల్లా జడ్జీ స్థాయి) పనిచేసిన మల్లంపాటి గాంధీ మంగళవారం నాడు ఏసీబీ కోర్టు ముందు లొంగిపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు మార్చి 17న మల్లంపాటి గాంధీ కార్యాలయాన్ని నివాసాన్ని సోదా చేసి అక్రమాస్తులు కనుగొన్నారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. ఈ అంశంపై మల్లంపాటి గాంధీ బెయిల్ పిటీషన్ దాఖలు చేసినా ఏసీబీ కోర్టు దానిని మార్చి 29న తిరస్కరించింది. అనంతరం బెయిల్ పొందిన మల్లంపాటి గాంధీ బయటకు వచ్చారు. అయితే సుప్రీంకోర్టు మల్లంపాటి గాంధీ బెయిల్ పిటీషన్‌ను రద్దు చేసి జూలై 10లోగా ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ఆయన మంగళవారం నాడు ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.