క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ రాజేశం మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హుస్నాబాద్ అరెపల్లికాలనీలోని 16 వార్డులో రూ. 22లక్షల మురికి కాలువ నిర్మాణం పనులకు సంబంధించి ఎంబి రిక్డాలు చేసేందుకు సదరు కాంట్రాక్టర్‌ను 20 వేలు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ రాజేశం డిమాండ్ చేశాడు. విధిలేని పరిస్థితుల్లో బాధితుడు ఎలగందుల లక్ష్మీనారయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సదరు కంట్రాక్టర్ ద్వారా తన ఇంట్లో ఏఈ రాజేశం 20వేల లంచం ఇస్తుండగా మెదక్ ఏసీబి అధికారులు అధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబి డీఎస్పీ శ్రీకృష్ణగౌడు ఎస్‌ఐలు అశోక్‌కుమార్, భరత్‌కుమార్, మురళీకృష్ణ పాల్గొన్నారు.