క్రైమ్/లీగల్

సబ్ జైల్‌లో జీవిత ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 12: ఓ చిన్నారి బాలుడి హత్యకేసులో జీవిత ఖైదు శిక్షతో ఈనెల 10న మదనపల్లె సబ్‌జైల్‌లో ఉన్న ముద్దాయి గురువారం వేకువజామున ప్రాంతంలో సబ్‌జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి కథనం మేరకు.. చిత్తూరు జిల్లా కురబల కోట మండల కేంద్రంలో మస్తాన్ వలీ అదే ప్రాంతానికి చెందిన షబీనాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే షబీనా తన మాట వినకుండా కువైట్ వెళ్లిందనే అక్కసుతో 2015 సెప్టెంబర్ 1న షబీనా నాలుగేళ్ల కుమారుడు ఇమ్రాన్‌ను గొంతునులిమి చంపేశాడు. ఈఘటనలో నమోదైన కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిందితుడు మస్తాన్ వలికి ఈనెల 10న తేదీన జీవిత ఖైదు, జరిమాన విధించారు. ఈమేరకు ఆ ముద్దాయిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. గురువారం వేకువజామున మరుగుదొడ్డికి వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.