క్రైమ్/లీగల్

అధికారాలన్నీ మీవే.. సమస్యలు మాత్రం పట్టవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశ రాజధాని ఢిల్లీలో చెత్త పర్వతాలవలే పేరుకుపోయి దుర్భరమైన పరిస్థితి నెలకొందని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం నిలదీసింది. నగరంలో చెత్త నిర్వహణ వ్యవహారం స్థానిక సంస్థలు చూస్తాయని, కేవలం అజమాయిషీ చేయడమే తన పని అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన వివరణపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ‘నాకే అన్ని అధికారాలున్నాయని చెబుతారు. నేనే సర్వం అని వాదిస్తుంటారు. అయితే నగరంలోని సమస్యలు మాత్రం మీకు పట్టదు’ అని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం సమాధుల దొడ్డిలా మారిపోయిందని, దీనికి కారణం ఎవరంటూ న్యాయమూర్తులు మందలించారు. ‘నగరంలో చెత్త మేటలు వేసింది. ఘాజీపూర్, ఓఖ్లా, భాల్‌స్వాలో పర్వతాలను మించిపోయింది’ అని అధికారులును, లెఫ్టినెంట్ గవర్నర్ యంత్రాంగాన్ని కోర్టు తప్పుపట్టింది. ఘన వ్యర్థాల నిర్వహణ ఏదని బెంచ్ నిలదీసింది. సమావేశాలతో కాలయాపన చేయడమే తప్ప సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని న్యాయమూర్తులు అన్నారు. ‘ఇప్పటికి పాతికసార్లు సమావేశాలు జరిగాయి.. అయితే ఫలితమేముంది? పర్వతాల్లా చెత్తపేరుకుపోయింది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సమస్య పరిష్కారానికి తీసుకునే చర్యలపై సోమవారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ దుర్భర పరిస్థితి నుంచి నగర పౌరులను ఎప్పటికి గట్టెక్కిస్తారో స్పష్టం చేయాలని వారు అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం కింద ఘన వ్యర్థాల నిర్వహణపై లెఫ్టినెంట్ గవర్నర్‌కే అధికారాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే తాను అజమాయిషీ చేయడమే తప్ప అంతా స్థానిక సంస్థలే చూసుకుంటాయని అనిల్ బైజాల్ వాదించారు. పరిస్థితి ఇంత దారుణంగా తయారవ్వడానికి కారణమెవరని నిలదీసిన సుప్రీం వచ్చేవాయిదా నాటికి వివరణ ఇవ్వాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా అధికారాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడేళ్లుగా వివాదం సాగుతోంది. అన్ని విషయాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్ తలదూరుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. రోజువారీ కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే సర్వాధికారాలుంటాయన్న సుప్రీం కోర్టు ధర్మాసనం లెఫ్టినెంట్ గవర్నర్ నామామాత్రమేనని విస్పష్టంగా ప్రకటించింది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అమలు మాత్రమే చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలాఉండగా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు తెలపాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన పది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. ఢిల్లీలో చెత్తపేరుకుపోవడంపై మార్చి 27న విచారించిన న్యాయస్థానం ఘాజీపూర్‌లో చెత్తనింపే ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘73 మీటర్ల కుతుబ్‌మీనార్ ఎత్తును మించిపోయేలా చెత్తపేరుకు పోయింది’ అని పేర్కొంది.

చిత్రం..అనిల్ బైజాల్