క్రైమ్/లీగల్

వివక్షత మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కాన్ని ఒక నేరంగా పరిగణించడం మానివేస్తే దీనికి సంబంధించిన లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల పట్ల సామాజిక వివక్షత దానంతట అదే తగ్గుతుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసన వ్యాఖ్యానించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కం, దీనితో ముడిపడి ఉన్న వ్యక్తుల పట్ల వివక్షత ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉందని కోర్టు పేర్కొంది. గురువారం సుప్రీంకోర్టులో సెక్షన్ 377ను తొలగించాలని కోరుతూ స్వలింగ సంపర్కుల తరఫున న్యాయవాది మనేకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ విచారణ మూడో రోజు కూడా కొనసాగింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగ హక్కులను స్వలింగ సంపర్కులు వినియోగించుకోకుండా చట్టపరమైన అవరోధాలు ఏవైనా మీ దృష్టిలో ఉన్నాయా అని న్యాయవాదిని అడిగింది. దీనికి మహిళా న్యాయవాది స్పందిస్తూ అటువంటి అడ్డంకులు ఏవీ లేవన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, లెస్బియన్లు (మహిళా స్వలింగ సంపర్కులు), గే (పురుష స్వలింగసంపర్కులు), బైసెక్యువల్ (పురుషులు, మహిళలతో లైంగిక సంబంధాలు కలిగిన వారు), ట్రాన్స్ జెండర్ (హిజ్రాలు), క్వీర్ ( స్వలింగ సంపర్కం పట్ల ఆసక్తి ఉన్న వారు) సామాజికపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని, వీరు స్వలింగ సంపర్కం పట్ల ఆసక్తి కలిగి ఉండడంతో వీరిని నేరస్తులుగా చూస్తోందని పేర్కొంది. ఒకసారి ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేస్తే అన్ని సమస్యలు సమిసిపోతాయని కోర్టు పేర్కొంది. సెక్షన్ 377 అసహజ లైంగిక సంబంధాలను నేరాలుగా పరిగణిస్తుందని కోర్టు పేర్కొంది. అసహజ లైంగిక నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షను విధించే సెక్షన్లు అమలులో ఉన్నాయి. ఈ నేరాలకు పాల్పడిన వారికి జరిమానాను కూడా విధిస్తారు. మరో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదనలు వినిపిస్తూ, సెక్షన్ 377ను మాత్రమే రద్దుచేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ మల్హోత్రా జోక్యం చేసుకుని, వైద్య నిపుణులు కూడా గోప్యత పాటించడం లేదని పేర్కొన్నారు. కాగా సెక్షన్ 377ను కొనసాగించాలా వద్దా , దీనికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయించాలని కేంద్రం కోరింది.