క్రైమ్/లీగల్

ఆ ఆరోపణలపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: న్యాయమూర్తి నాగార్జున రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌ను ఆదేశించింది. జస్టిస్ నాగార్జున రెడ్డికి సంబంధించిన కేసును బదిలీ చేయాలనే పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ తన పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తామీ కేసులో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ నాగార్జున రెడ్డిపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోణలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.
తాము జారీ చేసిన ఆదేశాలను పిటిషనర్ తుచాతప్పకుండా పాటించటం ఆయన క్రమశిక్షణను చూపిస్తోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నాగార్జున రెడ్డి తనపై దాడి చేశారంటూ రాయచోటికి చెందిన జూనియర్ సివిల్ న్యాయమూర్తి రామకృష్ణ గతంలో ఆరోపించటం తెలిసిందే. తన తమ్ముడిపై ఉన్న మర్డర్ కేసులో మరణ వాంగ్మూలాన్ని మార్చాలని నాగార్జున రెడ్డి వత్తిడి తెచ్చారని, ఇంటికి పిలిపించి దాడి చేయటంతోపాటు చెప్పిన మాట విననందుకు ఇంటి నుండి గెంటించారని రామకృష్ణ ఆరోపించటం విదితమే.