క్రైమ్/లీగల్

సీఐడీ కస్టడీకి ఎమ్సెట్ పేపర్ లీకేజి నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్సెట్ మెడిసిన్ పేపర్ లీకేజీ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులు వాసుబాబు, శివనారాయణలను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు అనుమతించింది. బుధవారం నిందితుల కస్టడీ కోరుతూ సీఐడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు నిందితులు ఇద్దరిని కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది. ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సీఐడీకి అనుమతిని ఇచ్చింది.
లీకేజీ కేసులో ప్రధానంగా చక్రం తిప్పింది వీరిద్దరే కావడంతో వారిని లోతుగా విచారించి దీని వెనుక చేతుల మారిన కోట్లాది రూపాయల బండారం బయటపెట్టడంతో పాటు అడ్డదారిలో ర్యాంకులు పొంది వైద్య విద్య చదువుతున్న వారి వివరాలు రాబట్టే అవకాశం ఉంది.
ప్రైవేటు కాలేజీల్లో పేరొందిన చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు దొడ్డిదారిలో ర్యాంకులు పొందిన విద్యార్థులు ఉన్నట్లు ఇప్పటికే సమాచారం సేకరించారు.
ఇదిలావుంటే లీకేజీ స్కాంతో సంబంధం ఉన్నట్లు నిందితులుగా గుర్తించిన మిగిలిన వారి కోసం సీఐడీ వేట ముమ్మరం చేసింది.
కోర్టు అనుమతించిన మేరకు శుక్రవారం నిందితులు ఇద్దరినీ కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.