క్రైమ్/లీగల్

వాట్సాప్‌పై నిఘా తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో జరిగే కార్యకలాపాల నియంత్రణ, నిఘా కోసం కేంద్రం ఆధ్వర్యంలోని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. వ్యక్తులపై నిఘాను ఏర్పాటు చేయడమేనని, వ్యక్తులు ఉపయోగించే వాట్సాప్, ట్విట్టర్, ఈమెయిల్ మెస్సేజ్‌లపై నిఘాను ఉంచడానికి చేస్తున్న చేస్తున్న ప్రయత్నంపై కేంద్రం రెండువారాల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. చీఫ్‌జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్‌లు ఏఎం కన్వీల్‌కర్, డిపై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మొయిత్రా వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పౌరుల వాట్సాప్ మెస్సేజ్‌లపై నిఘా పెట్టాలనుకుంటోందని, వారి ఈమెయిల్స్, ట్విటర్ ద్వారా జరిపే సంభాషణలు తెలుసుకోవాలనుకుంటోందని, ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించడమేనని, ఈ చర్యతో కేంద్రం ‘నిఘా రాజ్యాన్ని’ ఏర్పాటు చేయాలనుకుంటోందని మొయిత్రా తరఫున వాదించిన న్యాయవాది ఎంఎం సింఘ్వీ పిటిషన్‌లో ఆరోపించారు. సోషల్ మీడియా హబ్ ఏర్పాటు కోసం ఆగస్టు 20న టెండర్‌ను తెరవబోతున్నారని, ఈ సోషల్‌మీడియా హబ్ ద్వారా సామాజిక మాధ్యమాలను నియంత్రించాలనుకుంటున్నారని, వాట్సాప్, ట్విట్టర్‌లలో పెట్టే సందేశాలను చూడాలనుకుంటున్నారని సంఘ్వీ వాదించారు. దీంతో కోర్టు హబ్ ఏర్పాటు కోసం వేసే టెండర్ తెరవకముందే ఆగస్టు మూడో తేదీకి కేసును వాయిదా వేసింది. కాగా, సోషల్ మీడియా హబ్ ఏర్పాటు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అత్యవసరంగా కేసును విచారించాలంటూ వేసిన పిటిషన్‌ను జూన్ 18న సుప్రీం కోర్టు తిరస్కరించింది.