క్రైమ్/లీగల్

యువకుడిని బలిగొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూలై 14: ఒక యువకుడి మృతి కి కారణమైన లారీ డ్రైవర్ ప్రాణభయంతో సుమారు మూడు కిలోమీటర్లు పరుగెత్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టణంలో శనివారం సాయంత్రం జరిగింది. పట్టణ శివారు సాలార్‌జంగ్‌పేట లారీ అసోసియేషన్ వద్ద లారీ రివర్స్ చేస్తుండగా వెనుక డోర్ తగిలి బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ ఆసిఫ్ (25) మృతి చెందాడు. దీంతో స్థాని కులు తనను ఎక్కడ పట్టుకుం టారేమోననే భయంతో లారీ డ్రైవర్ రాజేందర్ సింగ్ (45) బస్టాండ్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు పరుగెత్తాడు. ఆయాసం ఎక్కువై బస్టాండ్‌లోనే గుండెపోటుతో మృతి చెందా డు. ఒకే సంఘటనకు సంబంధించి పట్టణంలో వేర్వేరుచోట్ల ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన విచిత్ర పరిణామం సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..కోదాడలో మృతి చెందిన ఆసిఫ్, రాజేందర్