క్రైమ్/లీగల్

విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, జూలై 15 : మండల పరిధిలోని గోపిందేవరపల్లిలో ఆదివారం ఉదయం ఆరో తరగతి చదువుతున్న నాగేష్ (11) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు భోజనాలు ముగించుకుని ఇంటి ముందు కూర్చొని ఉండగా నాగేష్ ఇంట్లో ఉరి వేసుకొన్నాడు. నాగేష్ తమ్ముడు పది నిముషాల తర్వాత ఇంట్లోకి వెళ్లగా ఉరేసుకుని తన అన్నను చూసి గట్టిగా కేకలు వేశాడు. తల్లి అరుసుకుంటూ లోపలికి వెళ్లి చుట్టు పక్కల వారి సాయంతో కిందకు దించి హుటాహుటిన హిందూపురం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో నాగేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పేను గుళికలు మింగి చిన్నారి మృతి
లేపాక్షి, జూలై 15 : మండల కేంద్రంలో చాక్లెట్లుగా భావించిన ఓ చిన్నారి పేను గుళికలు తిని మృత్యువాత పడింది. పాత లేపాక్షికి చెందిన జబీవుల్లా, తాబున్నీసాల కుమార్తె జియూబీ (3) ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ తల్లి పేనుల నివారణకు ఉపయోగించే గుళికలను చాక్లెట్లుగా భావించి తినేసింది. గమనించిన తల్లి వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.