క్రైమ్/లీగల్

భర్తను హతమార్చిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమల, జూలై 15: చేసిన తప్పును సరిదిద్ధుకోవాలని చెప్పిన భర్తను అడ్డుతొలగించేందుకు ఏకంగా భర్తను హతమార్చిన సంఘటన చిత్తూరుజిల్లా సోమల మండలంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని పుంగనూరు రూరల్ సిఐ సాయినాధ్, సదుం ఎస్‌ఐ నాగరాజులు పరిశీలించారు. వారి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... సోమల మండలం ఆవులపల్లెకు చెందిన జి.గంగాధర్(50) 15 ఏళ్ల క్రితం చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలోని పెద్దూరుకు చెందిన కుమారి(40)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరు బతుకుదెరువు కోసం ఆవులపల్లె నుంచి సదుం మండలం తాటిగుంటపాళెంలో నివాసం ఉండేవారు. స్వగ్రామంలో ఉన్న ఇంటిని కొంతమంది కబ్జా చేస్తుంటే ఏడాదికితం స్వగ్రామానికి చేరుకుని కూలీపనులు చేసుకుని జీవనం సాగించేవారు. సదుం మండలం తాటిగుంటపాళెంకు చెందిన వ్యక్తితో భార్య కుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. తన స్వగ్రామానికి వచ్చేసినా వారి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, ఈ విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు మందలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం గ్రామపెద్దలతో పంచాయతీ నిర్వహించాలని భర్త గంగాధర్ తన బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పంచాయతీలో తన గుట్టురట్టు చేసి అవమానం చేస్తారని భావించి రాత్రి నిద్దురపోయే ముందు భార్య కుమారి ఆరుబయట ఉన్న రుబ్బురోలును ఇంటిలోకి తీసుకువచ్చి పెట్టింది. రాత్రి 2-3గంటల ప్రాంతంలో నిద్దురపోతున్న భర్తపై రుబ్బురోలు బండతో తలపై బలంగా మోదింది. దీంతో భర్త అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కుమారుడు రెడ్డివిజయ్(13) తండ్రి రక్తపుమరకలతో పడి వుండటాన్ని గమనించి కేకలు వేశాడు. పరిసరప్రాంత నివాశితులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణకై భార్యను అదుపులోకి తీసుకున్నారు. హతుడు సోదరుడు వెంకటస్వామి ఫిర్యాదు మేరకు సదుం ఎస్‌ఐ నాగరాజు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనాధలుగా మారిన పిల్లలు
గంగాధర్, కుమారిలకు ముగ్గురు సంతానం. రెడ్డివిజయ్(13), రెడ్డిదివ్య(11), రెడ్డిరాణి(9)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. తండ్రి జీవనాధరంతో బతుకుతున్న కుటుంబం, తండ్రి హత్యకు గురికావడం, చేసిన తప్పుకు తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబం చిన్నాభిన్నంగా మారడంతో కుమార్తెలు, కుమారుడు అనాధలుగా మిగిలిపోయారు. కట్టుకున్న భర్తను కడతేర్చి, నవమాసాలతో పుట్టిన బిడ్డలను పట్టించుకోకుండా తన సుఖం కోసం ఏకంగా భర్తను హతమార్చి, బిడ్డల ఆలనపాలనకు దూరమై జైలుపాలైంది ఆ తల్లి. తండ్రి మరణంతో కన్నీరుపెడుతున్న పిల్లలను అందరూ ఓదార్చేవారే కానీ.. అక్కున చేర్చుకునే వారు కరువైయ్యారు. రక్తం పంచుకుని పుట్టిన బంధువులు ఉన్నప్పటికీ పట్టించుకోక పోవడం, వారి ఆర్తనాధాలు పలువురిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం ఈ పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.