క్రైమ్/లీగల్

సోమల యువరైతుపై చౌడేపల్లె ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌడేపల్లె: అసభ్యంగా మాట్లాడవద్దని యూనిఫారం లేని ఎస్‌ఐకి ఓ యువకుడు హితవుపలికాడు. నేనెవరో నీకు తెలుసా.. అంటూ ఎస్‌ఐ ప్రతిఘటించారు. అతనిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ఎస్‌ఐ, స్టేషన్‌కు కొత్తగా వచ్చిన ఎఆర్ కానిస్టేబుళ్లచే తీవ్రంగా చితకబాదాడు. సోమలలో జరిగిన హత్యకేసు పరిశీలించి తిరుగుప్రయాణంలో వచ్చిన పుంగనూరు సిఐ సాయినాధ్ చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి, అపస్మారక స్థితిలో పడివున్న యువకుడిని వెంటనే తన వాహనంలోనే పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదనపల్లె, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. ఈ సంఘటన ఆదివారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి.. సోమల మండలానికి చెందిన చలపతి కుమారుడు గణేష్(27) అగ్రికల్చర్ బిఎస్సీ చదువుకుని ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యవసాయంలో తండ్రి చేదేడువాదోడుగా నిలిచి రైతుగా స్థిరపడ్డాడు. ఈనేపథ్యంలో తాను పండించిన టమోటాలను తన స్వంత బెలోరోఫికప్ వాహనంలో ఆదివారం ఉదయం పుంగనూరు మార్కెట్‌కు తరలించి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా చౌడేపల్లె సమీపంలోని ఎస్‌ఐ క్రిష్ణప్ప వాహనాలు తనఖీలు చేపట్టారు. యూనిఫారంలో లేని ఎస్‌ఐ వాహనచోదకులను అసభ్య పదజాలంతో మాట్లాడుతుండగా.. మర్యాదగా మాట్లాడండి సార్.. అంటూ ముందుకు వచ్చిన గణేష్‌ను అదేతరహాలో మాట్లాడాడు. నిబంధనలు పాటించలేదని రూ.150లు అపరాద రుసుము కట్టాలని ఎస్‌ఐ రసీదు రాసిచ్చారు. ఇరువురు కొంత వాగ్వావాదం చేసుకోవడం, గణేష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కొత్తగా వచ్చిన ఎఆర్ కానిస్టేబుల్స్‌తో కలసి ఎస్‌ఐ తీవ్రంగా చితకబాదాడు. సోమల మండలంలో జరిగిన హత్యకేసును పరిశీలించి తిరిగి పుంగనూరుకు వెళ్తున్న పుంగనూరు సిఐ సాయినాధ్ చౌడేపల్లె పోలీస్‌స్టేషన్ పరిశీలించారు. స్టేషన్‌లో అపస్మారకస్థితిలో పడివున్న యువకుడిని చూసిన సిఐ సాయినాధ్ జరిగిన విషయంపై ఆరా తీస్తు, యువకుడిని తన వాహనంలో పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. పరిస్థితి విషమించడంతో మదనపల్లె, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆ యువరైతు గణేష్ కోమాలో ఉండగా, విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
చౌడేపల్లె ఎస్‌ఐ క్రిష్ణప్ప సస్పెండ్
- పలమనేరు డిఎస్‌పి వెల్లడి:-
చౌడేపల్లె ఎస్‌ఐ క్రిష్ణప్పను సస్పెండ్ చేస్తూ రాయలసీమ డిఐజి ప్రభాకర్‌రావు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసినట్లు పలమనేరు డిఎస్‌పి చౌడేశ్వరి వెల్లడించారు. ఆదివారం చౌడేపల్లెలో జరిగిన సంఘటనపై పలమనేరు డిఎస్‌పి చౌడేశ్వరిని వివరణ కోరగా జరిగిన సంఘటనపై విచారణకు బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సివుందన్నారు. సంఘటనలో గాయపడిన గణేష్‌కుమార్‌ను ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లో చికిత్సలు చేయిస్తున్నామని, ఏలాంటి ప్రమాదం లేదని డిఎస్‌పి చౌడేశ్వరి వెల్లడించారు. కల్లూరు ఎస్‌ఐగా ఉన్న క్రిష్ణప్ప మదనపల్లె రెండవ పట్టణ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. చౌడేపల్లె ఎస్‌ఐ శ్రీనివాస్ ఎసిబికి పట్టుబడటంతో క్రిష్ణప్పను చౌడేపల్లెకు బదిలీ చేశారు. కాగా ఎస్‌ఐ క్రిష్ణప్పను సస్పెండ్ చేస్తు రాయలసీమ డిఐజి ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు పలమనేరు డిఎస్‌పి చౌడేశ్వరి వెల్లడించారు.

చిత్రం..చికిత్స పొందుతున్న యువరైతు గణేష్