క్రైమ్/లీగల్

ఉచ్చు బిగిస్తున్న సిఐడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్సెట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఇద్దరినీ లోతుగా విచారిస్తోంది. నాలుగు రోజులపాటు కోర్టు అనుమతితో నిందితులు వాసుబాబు, శివనారాయణను సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుల కస్టడీ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తవుతుంది. దీంతో సమయం లేకపోవడంతో కేసులో అసలు కుట్రదారులైన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలపై ఉచ్చుబిగించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. నిందితులు ఇద్దరూ పేపర్ లీకేజీ కుంభకోణంలో విద్యార్థులను తాము పనిచేసే కళాశాలల నుంచే కాకుండా తమకు టచ్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల్లోని వారితో సైతం పరీక్షలు రాయించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు నమ్ముతోంది. ఇప్పటికే విచారణలో తేలిన తెలుగు రాష్ట్రాల్లోని రెండు కార్పొరేట్ కళాశాలలే కాకుండా మరికొన్ని కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితులు ఇద్దరిని విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు వీలుగా ప్రాక్టీస్ టెస్ట్ నిర్వహించిన నగరాలకు తీసుకు వెళ్లి ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎవరి సహకారంతో నిర్వహించారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సొమ్ములు చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్లను సీఐడీ రికార్డు చేసింది. శివనారాయణను కటక్ తీసుకెళ్లిన సీఐడీ బృందం అక్కడ ఎలా ప్రాక్టీస్ టెస్ట్ నిర్వహించిందీ వివరాలు రాబడుతున్నారు. హైదరాబాద్‌లో మరోనిందితుడు వాసుబాబును సైతం సీఐడీ బృందాలు విచారించాయి. నిందితులు ఇద్దరి కీలక విచారణలో కార్పొరేట్ కళాశాలల ర్యాంకుల గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు.