క్రైమ్/లీగల్

మొక్కు తీర్చుకొని వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ: సూర్యాపేట శివారులోని దండుమైసమ్మ దేవాలయం వద్ద మొక్కు తీర్చుకొని తిరిగి వెళ్తున్న ట్రాలీ ఆటో 65వ నెంబరు జాతీయ రహదారి కోదాడ బైపాస్‌లో ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన గురించి కోదాడ ఇన్‌స్పెక్టర్ యు.శ్రీనివాసరెడ్డి చెప్పిన వివరాల మేరకు- కృష్ణా జిల్లా మక్కపేటకు చెందిన శీలం సుభాని అల్లుడు దొంతెబోయిన గోపి కుమారుని పుట్టి వెంట్రుకల తీయంచేందుకు సూర్యాపేట శివారులోని దండు మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. మొక్కు తీర్చుకున్న అనంతరం తిరిగి మక్కపేటకు ట్రాలీ ఆటోలో వెళ్తుండగా కోదాడ బైపాస్‌పై ట్రాలీ ఆటో టైర్ పగిలి పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వత్సవాయి మండలం మక్కపేటకు ఆళ్ల గురుస్వామి, పల్లెబోయిన వీరయ్య, భీమవరానికి చెందిన హుస్సేన్‌సాహెబ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాల పాలైన భీమవరానికి చెందిన పీ. కొండను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన కోసంగి వెంకటేశ్వర్లు, గట్టయ్య, నాగేశ్వర్‌రావు, ముత్తయ్య, నాగరాజు, రామారావు, పుల్లయ్య, ఆదినారాయణ, సుభాని, గాలం వెంకటేశ్వర్లు, సైదులు, లతీప్, గోపి, రాజు, కోటేశ్వర్‌రావు, కృష్ణను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాలీలో 25 మంది ప్రయాణిస్తుండగా నలుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. మృతులు చంద్రన్న బీమాలో సభ్యులుగా ఉంటే ఐదు లక్షల రూపాయలు బీమా మంజూరుచేస్తామని ఆయన చెప్పారు.

చిత్రం..కోదాడ బైపాస్‌లో ఆదివారం సాయంత్రం టైర్ పగిలి పల్టీ కొట్టిన ఆటో