క్రైమ్/లీగల్

గంజాయి స్వాధీనం నింధితులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 16: ఎక్సైజ్ పోలీస్ అధికారులు రూట్ వాక్ చేస్తుండగా రెండులక్షల విలువ చేసే 40కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా నింధితుడు పట్టుబడ్డ వైనం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని బుచ్చెయ్యపేట మండలం రాజాం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ సిఐ ఈశ్వరరావు అందజేసిన వివరాలిలావున్నాయి. అనకాపల్లికి చెందిన ఎక్సైజ్ సిఐ శంకరరావు, ఎస్‌ఐ చంద్రవౌళి, స్థానిక ఎక్సైజ్ సిఐ ఈశ్వరరావు ఆద్వర్యంలో పోలీస్ సిబ్బంది రూట్ వాక్ చేస్తుండగా యమహ కిసినో వాహనంపై 40కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు చక్కా మోహనరావు, త్రినాథరావు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. వీరిలో త్రినాథరావు ఫలాయనం చిత్తగించగా మోహనరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసి కేసునమోదు చేసారు. గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు సిఐ ఈశ్వరరావు తెలియజేసారు.