క్రైమ్/లీగల్

ఎస్సీ హాస్టల్ విద్యార్థులపై పోకిరీల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూలై 16: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్ నంబర్ 2 లో ఉంటున్న 8,9వ తరగతులు చదువుకుంటున్న విద్యార్థులపై శుక్రవారం గుర్తు తెలియని విద్యార్థులు హాస్టల్లో చొరబడి దాడికి పాల్పడ్డారని ఈవిషయంపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఐదుగురు ఉన్నత అధికారులతో విచారణకు ఆదేశించారు. డీఆర్వో పద్మయ్య, తహాసీల్దార్ అనుపమరావు, చైల్డ్ అధికారి శాంతతో పాటు మరో ఇద్దరు అధికారులు హాస్టల్ పరిసరాలను పరిశీలించి సంఘటనపై విద్యార్థులను విచారించి ఉన్నతాధికారుల కమిటి నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ హాస్టల్ వార్డెన్ రాజయ్య, వాచ్‌మెన్ రాజశేఖర్‌లను సస్పెండ్ చేశారు. వివరాలోకి వెళితే జిల్లా కేంద్రంలోని ఎస్సీ-2 హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు రాజ్‌కుమార్, రవితేజ, రంజిత్, శేఖర్, రవితేజ, రాజశేఖర్, రణదీఫ్, సుధీర్‌లను స్థానికంగా ఉంటున్న ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గత శుక్రవారం హాస్టల్లో చొరబడి తీవ్రంగా విద్యార్థులపై దాడికి దిగారు. ఈవిషయం తెలుసుకున్న వార్డెన్ స్థానిక వైస్ చైర్మన్‌కు తెలిపారు. దీంతో ఆయన విచారణ జరిపిస్తానని దాటవేయడంతో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి మొగిలయ్య దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించి విద్యార్థుల తల్లి దండ్రులకు నచ్చజెప్పడంతో పాటు హాస్టల్ అధికారులను హెచ్చరించారు. ఈసమావేశం జరుగుతున్న సమయంలో మరోమారు ఆపోకిరీలు హాస్టల్‌లోకి రాళ్లురువ్వారు. బయాందోళన చెందిన విద్యార్థి తల్లి దండ్రులు పాఠశాల నుండి టీసీలు తీసుకున్నారు. ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.