క్రైమ్/లీగల్

కరుడుగట్టిన ఆరుగురు దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 16: రైలులో వస్తారు.. జన సంచారం లేని ప్రాంతాల్లో పగలు రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనం చేసుకుని వెళ్లి పోతారు. సీసీఎస్, బాలనగర్, మాదాపూర్ పోలీసులు కరుడుగట్టిన ఆరుగురు ఘరాన దొంగలను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మహారాష్టక్రు చెందిన, మరో ముగ్గురు ఏపీకి చెందినవారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 50లక్షలు విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పెద్దపారుపూడికి చెందిన గాలింక రాంబాబు(31) కారు డ్రైవర్. పెద్దపారుపూడి నుంచి నగరానికి కారులో వచ్చి ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తాడు. రాత్రి సమయంలో వచ్చి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సొత్తు దొచుకుని ఉడాయిస్తాడు. 2016 నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పలు చోరీలు చేసినట్లు సీపీ వివరించారు. రాంబాబుని జూబ్లీహిల్స్ పోలీసుల 2016లో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపించారని 2018 ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన రాంబాబు మూడు నెలల్లో తొమ్మిది నేరాలు చేశాడని చెప్పారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం, రాజుపాలెం కర్ని మల్లికార్జున్ (28), కట్టేల అనూప్ కుమార్ (27), గచ్చిబౌలి, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో నివాసముంటు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారు. వీరిద్దరు ముఠాగా ఏర్పాడి నేరాలు చేస్తున్నారని మల్లికార్జున్, అనూప్ కుమార్, రాంబాబు నుంచి కిలో బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ముగ్గురు నిందితులను మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. మహారాష్టల్రోని హిగోలీ జిల్లా పర్భినికి చెందిన బలీరాం విశ్వనాథ్ జాదవ్ (35) సుఖ్‌దేవ్ మారుతి పవర్ (42) పిట్ల అంకుస్ అలీయాస్ అంకుస్ రామ్ సింధూ (32)ను బాలనగర్ సీపీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 54 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునట్లు సీపీ చెప్పా రు. నిందితులు రైలు మార్గంలోనే వచ్చి పగలు రెక్కి నిర్వహిస్తారని రాత్రి దొంగతనం చేసుకుని తిరిగి వెళ్లిపోతారని సీపీ వివరించారు. శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేస్తారని వీరిపై మహారాష్టల్రో కూడా కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు సీపీ చెప్పారు. ఆరుగురు నిందితులు సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 35 దొంగతనాలు చేశారని వీరి నుంచి 50లక్షల విలువ చేసే కీలోన్నర బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకునట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏడీసీపీ నతానియేలు, ఏసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.