క్రైమ్/లీగల్

యజమాని ఇంటిలో చోరీకి పాల్పడ్డ భార్యభర్తలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: తిన్నింటి వాసాలు లెక్కేసే వారుంటారని నానుడిని తిరుపతికి చెందిన భార్యాభర్తలు నిజం చేశారు. బతకడానికి తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చిన యజమాని ఇంటిలోనే చోరీకి పాల్పడ్డారు. ఆపై క్రైం పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. తిరుపతి క్రైం డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన రావిపాటి మోహన్ బతుకు జీవనం కోసం తిరుపతికి వచ్చి తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలోవున్న త్యాగరాజు అనే వ్యక్తికి చెందిన వెల్డింగ్ షాపులో ఉద్యోగానికి చేరాడు. ఈ క్రమంలో సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన జ్యోతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మోహన్ తాగుడుకు బానిస కావడంతో దుకాణంలో వస్తున్న జీతం కుటుంబ పోషణకు సరిపోయేదికాదు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడేనికి వెళ్లి వ్యాపారం చేసుకుని జీవించాలనుకున్నారు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇదిలా ఉండగా మోహన్ భార్య జ్యోతి త్యాగరాజు ఇంటికి వెళుతూ వారి కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుంది. ఈ సందర్భంగా త్యాగరాజు ఆయన కుటుంబ సభ్యులు నగదు, నగలు ఎక్కడ దాచుకుంటారో గమనిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని తన భర్త మోహన్‌కు చెప్పింది. వారి ఇంట్లో ఉన్న నగలు, నగదు చోరీ చేయాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా త్యాగరాజు ఇంటికి వెళుతూ వస్తున్న జ్యోతి చాకచక్యంగా వారింటి బీరువా తాళాలను తస్కరించింది. ఇటీవల త్యాగరాజు వారి కుటుంబం బెంగళూరుకు వెళ్లినప్పుడు మోహన్, ఆయన భార్య జ్యోతి ముందుగా తస్కరించి తయారు చేయించుకున్న మారు తాళాలతో ఇంటిలోకి ప్రవేశించారు. బీరువా మారు తాళాలతో తెరిచి 241 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30వేలు నగదును తస్కరించుకుని యథాలాపంగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అటు తరువాత ఇంటికి వచ్చిన త్యాగరాజు కుటుంబ సభ్యులు వేసిన తాళాలు వేసినట్లు ఉండగానే ఆభరణాలు నగదు చోరీకి గురైన విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ భాస్కర్ రెడ్డి కేసు దర్యాప్తు చేసే క్రమంలో మోహన్‌పై నిఘా పెట్టారు. దొంగిలించిన సొమ్ముతో తాడేపల్లిగూడేనికి వెళ్లడానికి మోహన్, జ్యోతిలు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో వెళుతుండగా క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అర్బన్ క్రైం అడిషనల్ ఎస్పీ సిద్ధారెడ్డి తెలిపారు.