క్రైమ్/లీగల్

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి/యాడికి, జూలై 17 : గుంతకల్లు డివిజన్ పరిధిలోని వేములపాడు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు దోపిడీకి విఫలయత్నమైంది. విధి నిర్వహణలో రైలు ఉన్న పోలీసులతోపాటు ట్రాక్ పక్కన పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అప్రమత్తంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సోమవారం రాత్రి కాచిగూడ నుంచి చిత్తూరుకు బయలుదేరిన 12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి గడిచిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున రాయలచెరువు రైల్వేస్టేషన్ దాటి వేములపాడు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే రైలును వేములపాడు రైల్వేస్టేషన్‌కు అనుమతించే ఎలక్ట్రికల్ సిగ్నల్ వైరు పని చేయకపోవడంతో లోకో పైలట్ రైలును అవుటర్‌లో నిలిపివేశాడు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా జరుగుతున్న వరుస దోపిడీలతో విసిగెత్తిపోయిన జీఆర్పీ పోలీసులు రైలు ఆగిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులతోపాటు పట్టాల పక్కనే పెట్రోలింగ్‌లో ఉన్న మరో ఇద్దరు పోలీసులు రైలు కోచ్‌ల వద్దకు చేరుకుని పక్కనే ఉన్న కంప చెట్లలోకి టార్చ్‌లైట్లతో పరిశీలించారు. అప్పటికే విధి నిర్వహణలో భాగంగా హైవేపై నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మరో నలుగురు జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని రైలు కోచ్‌లకు అడ్డంగా నిలబడి ఒకరికి ఒకరు సంకేతాలిచ్చుకుంటూ అప్రమత్తం చేసుకుని, రైలు కిరువైపుల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకుని దొంగలు కనబడితే కాల్పులు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈతతంగమంతా జరుగుతుడటంతో ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకుని సిగ్నల్ వైర్లను కట్ చేసిన పార్థీ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు, రైలు డ్రైవర్ వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు 20 నిమిషాల అనంతరం రైలును తిరిగి అక్కడి నుంచి పంపించారు. అర్ధరాత్రి సమయంలో రైలు ఆవుటర్‌లో ఆగడంతో సుమారు 20 నిమిషాల పాటు ప్రయాణికులు భయాందోళ చెందారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
రైలు దోపిడీ విఫలయత్నం సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ డీఎస్పీ పీఎన్ బాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాయలచెరువు, వేముల పాడు పరిసర ప్రాంతాలలో పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
రైలు దోపిడీల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
* ఎస్పీ అశోక్‌కుమార్
గుత్తి, జూలై 17 : జిల్లాతోపాటు కర్నూలు జిల్లాల్లో ఇటీవల జరుగుతున్న వరుస రైలు దోపిడీల నియంత్రణకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గుత్తిలో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అవసరమైన భద్రత కల్పించడంతోపాటు వస్తువులకు రక్షణ కల్పించేందుకు సాధారణ పోలీసులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల వరుసగా జరుగుతున్న వరుస రైల్వే చోరీలను పరిశీలిస్తే చోరీలకు పాల్పడే ముఠా రాష్ట్రానికి సంబంధించింది కాదన్నారు. 2016లో దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేయగా అప్పట్లో చోరీలు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చోరీలకు, అప్పట్లో చేసిన ముఠాకు సంబంధం ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంతేగాకుండా నిందితులు జైళ్లలోనే ఉన్నారా.. బయట ఉన్నారా అని ఆరాతీస్తున్నామన్నారు. ముఠాకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామన్నారు. కేవలం ఒక్కనెలలో రెండు జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో చోరీలు జరగడం ప్రయాణికులను భయాందోళనను అభద్రతాభావానికి గురి చేస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకుముందు గుత్తి, గుంతకల్లు, డోన్, తాడిపత్రి ప్రాంతాల ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో సమీక్ష నిర్వహించారు.