క్రైమ్/లీగల్

ప్రమాదశాత్తు బావిలో పడిన సంఘటనలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జూలై 17: బావి వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిన సంఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలంలోని అప్పన్నపాలెం గ్రామానికి చెందిన కూడా అప్పలరాజు(13)( అనే విద్యార్ధి మండలంలోని తామరంలో గల కృపాకమల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతూ ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు . మంగళవారం ఉదయం స్కూల్ ఆవరణలో ఉన్న మెట్లున్న బావిలోకి స్నానం చేసేందుకు తోటి విద్యార్థి ఈవిద్యార్థి వెళ్ళాడు. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యార్థి అప్పలరాజు బావిలో పడి మృతి చెందాడు. విద్యార్థికి తండ్రి లేకపోవడంతో తల్లి వద్దనే ఉంటూ ఈపాఠశాలలో చదువుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న ఎం ఇ ఓ సాయిశైలజ, ఎస్సై విజయ్‌కుమార్‌లు మృతి చెందిన బావి ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.