క్రైమ్/లీగల్

హత్యాకేసులలో ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, జూలై 19: రైల్వేకోడూరు సర్కిల్ పరిధిలోని జి.వెంకటరామాపురం గ్రామానికి చెందిన తోట వెంకటరమణ, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన విజయకుమార్‌లకు అనే ముద్దాయిలకు జీవిత ఖైదు శిక్షను రాజంపేట కోర్టు జడ్జి సత్యవతి విధించినట్లు సీఐ సాయినాథ్ గురువారం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తన సిబ్బంది సహకారంతో ఈ కేసును చేధించినట్లు ఆయన చెప్పారు. 2009లో వెంకటరామాపురానికి చెందిన గబ్బి వెంకటయ్య, 2012లో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, 2013లో అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని ముద్దాయి వెంకటరమణ వరుస హత్యలకు పాల్పడినట్లు సీఐ చెప్పారు. హత్యలు చేసేందుకు తుపాకీ ఇచ్చి సహకరించిన విజయకుమార్‌కు కూడా ఇతనితో పాటు జీవితఖైదు విధించారన్నారు. ఇరుకుటుంబాల మధ్య భూ తగదా, క్రికెట్ ఆట ఆడుతుండగా చెలరేగిన ఘర్షణ కారణంగా ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులైన ముగ్గురిని వరుస హత్యలు చేసినందులకు శిక్ష పడిందన్నారు.