క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జూలై 19: కోట మండలం విద్యానగర్ సమీపంలో లారీ, మోటార్‌బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని విద్యానగర్‌లో ఉన్న నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న చిట్టమూరు మండలం ఉప్పలమర్తి గ్రామానికి చెందిన చందు, సూళ్లూరుపేటకు చెందిన షమీర్‌లు కోట నుంచి విద్యానగర్‌కి మోటార్‌బైక్‌పై వెళ్తూ విద్యానగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. వీరిలో షమీర్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.