క్రైమ్/లీగల్

బీదర్ నుండి గుట్కా సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 19: బీదర్ నుండి వరంగల్ పోలీసు కమిషనరేట్, భూపాలపల్లి, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జిల్లాల్లో గుట్కా సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌పోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారినుండి 27.74.000లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీసు కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా, మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉత్తరి శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన బత్తుల ప్రవీణ్‌లు కలిసి బీదర్‌నుండి గుట్కా దిగుమతి చేస్తున్నారు. దిగుమతి చేసిన గుట్కా ప్యాకెట్లను భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన మంచాల వెంకటేశ్వర్లు ఇంటి వద్ద నిలువ చేస్తారు. కమలాపూర్ గ్రామానికి చెందిన సుద్దాల కార్తిక్, హన్మకొండ భీమారం ప్రాంతానికి చెందిన నూక శ్రీకాంత్‌ల సహాయంతో వరంగల్, గోదావరిఖని, భూపాలపల్లి తదితర జిల్లాలకు గుట్కా సరఫరా చేస్తున్నారు. టాస్క్‌పోర్స్ పోలీసులకు ప్రత్యేకంగా అందిన సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన మంచాల వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసారు. ఈ సందర్భంగా ఇంట్లో నిలువ ఉన్న 2.88.000లక్షల విలువ చేసే గుట్కాలు, 66వేల రూపాయల విలువ చేసే ఖబాలి గుట్కాలు రెండు బస్తాలను, 20వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గుట్కా రవాణకు ఉపయోగిస్తున్న 13లక్షల విలువ చేసే హ్యుందాయ్(క్రియేటా)కార్, ఆరులక్షల విలువ చేసే హ్యుందాయ్ ఎక్సెంట్, ఐదులక్షల విలువ చేసే మారుతి సుజుకి మొత్తం మూడు కార్లను సీజ్ చేశారు.