క్రైమ్/లీగల్

యువతులపై పోకిరీల వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 19: నగరంలో మహిళలు, యువతులపై వేదింపులకు పాల్పడుతున్న ఏడుగురు పోకిరీలను షీటీమ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హన్మకొండ కిషన్‌పుర, పోచమ్మ మైదాన్, పబ్లిక్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో యువతులు, మహిళలను వేదిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో షీటీ మ్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు యువకులను షీటీమ్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని మట్టెవాడ పోలీసు స్టేషన్‌కు తరలించి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఏసిపి బాబురావు పోకిరీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. యువతులను వేధింపులకు గురిచేస్తే వాట్సాప్ నెంబర్ 9491089257 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏసీపీ తెలిపారు