క్రైమ్/లీగల్

ఎనే్నళ్లని తిరగాలి... నేనిక్కడే సచ్చిపోతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, జూలై 19: ఎనే్నళ్లని నేను మీ కార్యాలయంకు తిరగాలి. నా భర్తకిచ్చిన భూమి నాకు చెల్లదా. నాకు మీరు న్యాయం చేయరులే.. నేనిక్కడే సచ్చిపోతానంటూ ఓ వృద్ధురాలు నల్లమాడ తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. మండలంలోని సానేవారిపల్లికి చెందిన చండ్రాయుడికి 1987లో 4.48 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఆయన మృతి చెందిన తర్వాత అతడి భార్య సాలెమ్మ పేరిట భూమిని మార్చుకుంటూ పాసు పుస్తకం కూడా వచ్చింది. అయితే ఆమెకు సమీప బంధువైన చెన్నకేశవులుకు ఓ సంవత్సరంపాటు ఆ పొలాన్ని కౌలుకు ఇచ్చింది. ఆ సమయంలో అతను ఆ పొలాన్ని అతని పేరిట మార్చుకున్నాడని, ఆ పొలం తన పేరిట వున్నట్లు ఆన్‌లైన్ నుంచి తొలగించారని వృద్ధురాలు సాలెమ్మ తెలిపింది. దాన్ని ఆన్‌లైన్‌లో బ్లాక్ చెయ్యకుండా తన పేరిట ఒన్ బి వచ్చేట్టు చేయాలని కొనే్నళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యా యత్నం చేసినట్లు వృద్ధురాలు తెలిపింది. అయితే ఈ విషయంపై తహశీల్దార్ అబ్దుల్ హమీద్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ గతంలో సాలెమ్మ భర్త పేరిట ఇచ్చిన భూమిలో చండ్రాయుడు అనే వ్యక్తి సాగు చేశాడన్నారు. ఈ సమస్య తీర్చేందుకే తాము బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలిపారు. అయితే సాలెమ్మ సాగు చేస్తున్న పంటను వ్యవసాయ అధికారులు జియోట్యాగింగ్ ద్వారా నమోదు చేస్తే తిరిగి సాలెమ్మ పేరిట చేసే అవకాశం వుందన్నారు. ఆన్‌లైన్‌లో సాలెమ్మ పేరిట భూమి వుందన్న వివరాలు బ్లాక్ చేయడం వల్ల అవి జియోట్యాగింగ్‌కు సాధ్యం కాదని అయితే తాను మండల వ్యవసాయ అధికారికి ఓ లెటర్ ఇస్తానని అప్పుడు వాళ్ళు నమోదు చేస్తారని తహశీల్దార్ తెలిపారు. దీంతో శాంతించిన సాలెమ్మ తిరిగి తిరిగి బేజారయ్యి ఆ భూమి తన పేరిట వస్తుందో లేదో అని ఒంటిపై కిరోసిన్ పోసుకున్నానని, తనను క్షమించాలని వృద్ధురాలు రాతపూర్వకంగా తహశీల్దార్‌కు విన్నవించుకుంది. ఆమె భూమిక సంబంధించిన సమస్యను త్వరగా తాను పరిష్కరిస్తానని తహశీల్దార్ వివరించారు.
వేధింపులు అధికమవుతున్నాయి.. సామూహిక శెలవుపై వెళ్లిపోదామా...
నల్లమాడలోని తహశీల్దార్ కార్యాలయంలో గతంలో అధికారులు చేసిన తప్పు కారణంగా రైతుల భూములకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించడం కష్టసాధ్యం అవుతోందని దాంతో మండల వాసులు రెవెన్యూ సిబ్బందిని సూటిపోటు మాటలతో వేధిస్తున్నారని తహశీల్దార్ అబ్దుల్ హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపైన కిరోసిన్ పోసుకుంటానని బ్లాక్ మెయిల్ చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది అందరితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరం సామూహిక శెలవుపై వెళ్ళిపాదామా అని కిందిస్థాయి సిబ్బందిని తహశీల్దార్ అడిగారు. ఈ విషయం కదిరి ఆర్డీవోకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.