క్రైమ్/లీగల్

అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూలై 19: భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో ఆడామగా అశ్లీల నృత్యాలు చేస్తున్నారని సమాచారం అందిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. 53 మంది పురుషులు, ఐదుగురు స్ర్తిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. నగర ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ హోటల్‌లో ఈ నృత్యాలు జరుగుతుండగా బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికదాడులు నిర్వహించి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. హోటల్ నిర్వాహకుడితోపాటు భవానీపురంలోని ఒక సంస్థకు చెందిన అధినేత, సత్యనారాయణపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గెలాక్స్ పార్టీ పేరుతో ఆడామగలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. వీటికి కారకులైన ఈవెంట్ ఆర్గనైజర్లు కోటా సునీల్, సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్, సురేష్‌లు గెలాక్సీ కిట్టిపార్టీల పేరుతో ప్రతి బుధవారం రాత్రి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ వ్యాపారులు, కోటీశ్వరులకు అందమైన అమ్మాయిల ఫొటోలు చూపించి వారితో డ్యాన్స్‌లు వేసే అవకాశం ఉంటుందని నమ్మించి ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ప్రతి వారం ఇదే హోటల్‌లో ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందుకుని దాడులు నిర్వహించడంతో బండారం బయటపడింది. కాగా నిందితులు పట్టుబడిన ఆ హోటల్‌లో మద్యం సేవించరాదు. మద్యపానానికి అనుమతులు లేవు. పోలీసుల దాడుల్లో కండోమ్‌లు కూడా లభించాయని సమాచారం. పర్యాటక ప్రాంతంగా మారిన భవానీ ఐలాండ్‌కి సమీపంలో ఉన్న ఈ హోటల్‌కి పర్యాటకులను కూడా అమ్మాయిల బొమ్మలు చూపించి దారి మళ్లిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ నుండి ప్రైవేట్ యాంకర్లను తీసుకొచ్చారు. ఉర్రూతలూరించే వ్యాఖ్యనాలు ఊసిగొలిపే మాటలు ఈ ఈవెంట్ ప్రత్యేకతలు. ఆడామగా కలిసి ఆశ్లీల నృత్యాలతో మద్యం మత్తులో తూగుతూ ఊగుతూ అదో మైమరపించే లోకంలో విహరించినట్టుగా కట్టిపార్టీ ప్రత్యేకతలు. ఇలాంటి కిట్టిపార్టీ కోసం ధనవంతులు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారని సమాచారం. మత్తులో ఆడవారితో నృత్యాలు తాగుబోతులకు భూతల స్వర్గంలా ఈ పార్టీలకు తీర్చిదిద్దుతున్న ఆర్గనైజర్లు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీసులు గమనించకుండా ఉన్నారంటే పోలీసులకు కూడా మామూళ్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. టాక్స్‌ఫోర్స్ ఏసీపీ రమణమూర్తి రంగంలోకి దిగే వరకు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు వెలుగుచూడకుండా స్థానిక పోలీసులు గుట్టుచప్పుడు గాకుండా సహకరించారనే ప్రచారం జరుగుతుంది. ఈ దాడిలో టాక్స్‌ఫోర్స్ ఏసీపీ రమణమూర్తి, వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్, వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్, కొత్తపేట సీఐ జే మురళీకృష్ణ, భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి, టాక్స్‌ఫోర్స్ సీఐ, పోలీసు సిబ్బంది, మెరుపుదాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ముగ్గురు విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన మరో ఇద్దరు మొత్తం ఐదుగురు యువతులు, 53 మంది పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులకు కౌనె్సలింగ్ నిర్వహించి వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. మిగతా నిందితులను గురువారం కోర్టుకు హాజరుపర్చారు.