క్రైమ్/లీగల్

కుటుంబానే్న కడతేర్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బాలాపూర్, ఫిబ్రవరి 5: నగర శివారులోని బాలాపూర్ మండలం జిల్లేలగూడలో ఓ యువకుడు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హరీందర్ గౌడ్ తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత భార్యను పిడిగుద్దులతో కొట్టి చంపేశాడు. భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదాలు, ఆర్థికపరమైన ఇబ్బందులే హత్యకు కారణంగా తెలుస్తోంది. జిల్లెలగూడలోని సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో నివసించే మాలే హరేందర్ గౌడ్ మలక్‌పేట్‌లోని డెంటల్ క్లినిక్‌లో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య జ్యోతి (33) కుమారుడు అభితేజ్ (7), కుమార్తే సహస్ర (4) ఉన్నారు. గత కొంత కాలంగా భార్య జ్యోతితో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి కూడా గొడవ పడటంతో క్షణికమైన ఉద్రేకంతో హరీందర్ గౌడ్ సోమవారం తెల్లవారుజామున ఘాతుకానికి పాల్పడ్డాడు. హరీందర్ పోలీసులకు లొంగిపోయి జరిగిన ఉదంతాన్ని చెప్పడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య, పిల్లల భౌతికకాయాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరీందర్ ఒక్కడే ఈ దురాగతానికి పాల్పడ్డాడా? మరెవరి సహకారమైనా తీసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.