క్రైమ్/లీగల్

ప్రేమికుల బహిష్కరణ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, జూలై 22: ప్రేమ గుడ్డిది. వ్యక్తిగత స్వేచ్ఛ కు సంబంధించిన వ్యవహారం. ప్రేమికులు మోహంతో వెళ్లిపోతే ఏమి చేయగలం. ప్రేమికులను కాలేజీ నుంచి బహిష్కరించడం తగదం టూ ఒక కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. ఒక కాలేజీ యాజమాన్యం తమ కాలేజీలో ఒక యువతిని, ఆమెను ప్రేమించి తీసుకెళ్లిన సీనియర్‌ను కాలేజీని బహిష్కరించింది. ఈ విషయమై ప్రేమికులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ మహ్మద్ ముస్టాక్ విచారించారు. ‘ ప్రేమ వ్యవహారం, లేచిపోవడం కాలేజీ ప్రవర్తన నియమావళి ప్రకారం అనైతికం కావచ్చు. క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించినది కావచ్చు. ఇది కొంత మందికి పాపం, అనైతికం కావచ్చు. మరి కొంత మందికి ఇలాంటి ఘటనలు అనైతికం కాకపోవచ్చు. పాపం కాకపోవచ్చు. స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారంగా పరిగణించవచ్చు’ అని కోర్టు తీర్పులో పేర్కొంది. వ్యక్తుల గోప్యతకు సంబంధించిన వ్యవహారమనే విషయాన్ని కొల్లం కాలేజీ యాజమాన్యం గుర్తించలేకపోయిందని హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని నియంత్రించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదని పేర్కొంది. ప్రేమ గుడ్డిది. మానవులు ప్రేమావేశానికి గురవుతుంటారు. ఇదంతా ఆయా వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని కోర్టు తెలిపింది. ఇంతకీ ప్రేమలో పడిన ఇద్దరు విద్యార్థులు బీబీఏ కోర్సు చదువుతున్నారు. అబ్బాయి వయస్సు 21 ఏళ్లు, అమ్మాయి వయస్సు 20 ఏళ్లు. ఇరువురు విద్యార్థులను చదువుకోవడానికి అనుమతించాలని కోర్టు కాలేజీ యాజమాన్యా న్ని ఆదేశించింది. ఈ కేసులో అమ్మాయి 2016- 17లో కాలేజీలో చేరింది. వీరి ప్రేమకు కాలేజీ యాజమాన్యం, తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత అమ్మాయి తల్లితండ్రులు తమ కుమార్తె చర్యను వ్యతిరేకించినా, పెళ్లికి అంగీకరించారు. ఇటువంటి వ్యవహారాల్లో కోర్టులు చట్టబద్ధమైన స్వేచ్ఛను గౌరవిస్తాయని హైకోర్టు పేర్కొంది.