క్రైమ్/లీగల్

రౌడీషీటర్ మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 22: గత 5రోజుల క్రితం జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని అరవింద్‌నగర్‌లో కిడ్నాప్, హత్యకు గురైన రౌడీషీటర్ మాద అనిల్‌కుమార్ (21) మృతదేహం ఆదివారం నిజామాబాద్ జిల్లా బాసరలో లభ్యమైంది. జగిత్యాల మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు రౌడీషీటర్ అనిల్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన అనంతరం నిజామాబాద్‌లోని ఎస్సారెస్పీ కెనాల్‌లో పడేశారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితు లు రౌడీషీటర్ అనిల్‌కుమార్‌ను కిడ్నాప్‌చేసి హత్యచేసి ఎస్సారెస్పీ కెనాల్‌లో మృ తదేహాన్ని పడేసినట్లు పోలీసులకు తెలిపారు. రౌడీషీటర్ మృతదేహం కోసం గత 5 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఆదివారం నిజామాబాద్ జిల్లా బా సర సమీపంలో రౌడీషీటర్ అనిల్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. ముథోల్ మండల కేంద్ర ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువుల కు అప్పగించినట్లు సమాచారం.