క్రైమ్/లీగల్

మూక హింస ఘటనలను పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక హింసాత్మక ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల వదంతులతో చోటు చేసుకుంటున్న ఈ ఘటనల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీ లోకూర్, జస్టిస్ లలిత్ ఈ కేసును విచారిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న లైంగిక నేరాలను నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని, సామాజిక మాధ్యమాల ద్వారా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అనేక చోట్ల ఈ వదంతులను నమ్మి మూక హింసకు ప్రజలు దిగుతున్నారు. ఈ విషయాలను ఎవరు పట్టించుకోవడం లేదు అని పేర్కొంది. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం మూక హింస ఘటనలపై తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకుని మూకహింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని
రూపొందించాలని పార్లమెంటుకు ధర్మాసనం సూచించిన విషయం విదితమే. కాగా లైంగిక నేరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లకు సంబంధించి గూగుల్, యాహూ ఇండియా సంస్థ, మైక్రో సాఫ్ట్, ఫేస్‌బుక్ ఐర్లాండ్, వాట్సప్ సంస్థలు తాము తీసుకున్న చర్యలపై నివేదికను కోర్టుకు సమర్పించాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం అమలు చేయడం లేదని ఈ సంస్థల తరఫున న్యాయవాది కోర్టుకు నివేదించాయి. కోర్టు శాంతి భద్రతలకు సంబంధించి ఇచ్చే ఆదేశాలను కేంద్రం అమలు చేయాలని, ప్రజలు కూడా కేంద్రం తీసుకునే చర్యల గురించి ఆశగా ఎదురుచూస్తారని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఆగస్టు చివరి వారానికి వాయిదా వేసింది.