క్రైమ్/లీగల్

మా ఉత్తర్వులు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంపత్ కుమార్ సభ్యత్వాల రద్దును కొట్టి వేస్తూ తాము లోగడ ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామచందర్ రావును ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాదివా లేక పార్టీ ప్రతినిధివా అంటూ ఏజీని నిలదీసింది. అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి ఈ కేసుపై వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చే నెల 3వ తేదీకీ వాయిదా వేసింది. ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించకపోతే అసెంబ్లీ సెకక్రరీ, న్యాయశాఖ సెకట్రరీలకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేగాక, అవసరం అనుకుంటే అసెంబ్లీ స్పీకర్‌ను కూడా చేర్చాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. శుక్రవారం జస్టిస్ శివశంకర్‌రావు కోర్టు ధిక్కరణ ఫిటీషన్లపై విచారణ చేపట్టారు. ఇలాంటి కేసులో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోర్టు సూచించింది. రాజ్యంగ నియమాలను పాటించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో తమకు జీతాలు, భద్రత కల్పించలేదని పిటిషనర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా, ప్రతి నెలా అసెంబ్లీలో ఉన్న సభ్యుల జాబితాను ఎలక్షన్ కమిషన్‌కు పంపాల్సి ఉంటుందని, ఆ విధంగా జాబితాను ఇస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించగా, లేదని ఏజీ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో కోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఇది ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చే ఉత్తర్వులు కోర్టు ఆదేశాల కంటే ముఖ్యమైనవని పోలీస్ అధికారులు భావిస్తున్నట్టు కనిపిస్తున్నదని న్యాయమూర్తి శివ శంకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది న్యాయవాది వేదుల వెంకట రమణ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే, అసెంబ్లీ కార్యదర్శికి ఫామ్ వన్ నోటీసును జారీ చేసిన తర్వాతే వివరణ వింటానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.