క్రైమ్/లీగల్

సమాచార కమిషనర్లను ఎప్పుడు నియమిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)లలో ఖాళీలను భర్తీచేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఎందుకు భర్తీచేయలేదో వివరణ ఇవ్వడంతో పాటు ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం సహా ఏడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలుచేయాలని, గడువు ఎంతమాత్రం పొడిగించేది లేదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. రెండేళ్ల క్రితమే ఈ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేసినా స్పందన ఎందుకు లేదో కూడా అఫిడవిట్‌లో వివరించాలని జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. సీఐసీలో నాలుగు ఖాళీల భర్తీకి 2016లోనే ప్రకటన జారీచేశామని కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోర్టుకు తెలిపారు. భర్తీ కాకపోవడానికి గల కారణాలను అంశాల వారీగా అఫిడవిట్‌లో పొందుపరచాలని ఆమెను ఆదేశించింది. రాష్ట్ర సమాచార కమిషన్లలో కేసుల పెండింగ్‌కు సంబంధించి కూడా తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఏడు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలకు నోటీసులు జారీచేస్తూ ఎప్పటిలోగా భర్తీచేస్తారో ఖచ్చితమైన సమయాన్ని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు గడువు పొడిగించేది లేదనీ, విఫలమైన పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదన వినిపిస్తూ సీఐసీలో నాలుగు ఖాళీల భర్తీకి ఈరోజు కూడా ప్రకటన జారీచేశారని కోర్టుకు తెలిపారు. కేసు విచారణకు వచ్చిన రోజే ఈ ప్రకటన రావడం చూస్తే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి అవగతమవుతుందని ఆయన వివరించారు. దీనికి స్పందించిన న్యాయమూర్తులు ‘మీరేమీ ఆందోళన చెందకండి. అన్ని ఖాళీలు భర్తీ అయ్యేలా చూస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్, లోకేష్ బత్రా, అమ్రితా జోహ్రి తమ పిటిషన్‌లో కేంద్ర సమాచార కమిషన్ వద్ద ఇప్పటికే 25వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐసీకి ఒక్క కమిషనర్‌ను కూడా నియమించలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు సమాచార కమిషనర్లే ఉన్నారనీ, పదేళ్ల నాటి అప్పీళ్లనే ప్రస్తుతం పరిశీలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక గుజరాత్, మహారాష్టల్రలో చీఫ్ కమిషనర్లే లేరని తెలిపారు. సమాచార కమిషనర్లను, కమిషన్ సభ్యులను నియమించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఐ చట్టాన్ని నీరుగారుస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.