క్రైమ్/లీగల్

మదనపల్లెలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 28: ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తు ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రతిపక్షాల పోరాటం, వామపక్షాలు, ప్రజాసంఘాల ఉద్యమాలతో కేంద్రం స్పందించకపోవడం.. ఇక రాదేమో అన్న ఆవేదనతో ఓ చేనేత కార్మికుడు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ దిగువగొల్లపల్లెకు చెందిన నిమ్మన్నగారి రామచంద్ర, సరోజమ్మ 15 ఏళ్ల క్రితం మదనపల్లె పట్టణం శివారుప్రాంతం చీకలగుట్ట గౌతమినగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలతో ఒక్కగానొక్క కుమారుడు సుధాకర్‌యాదవ్ సంతానం.
తల్లి సరోజమ్మ, తండ్రి రామచంద్ర మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కుమారుడు సుధాకర్‌యాదవ్ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ చేనేత కార్మికుడుగా జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం గురుపౌర్ణమి రోజు చైతన్య అనాధాశ్రమ పిల్లలకు అన్నదానం చేసి, రూ.5వేల నగదు అందజేశాడు. అనాథాశ్రమం ఇచ్చిన రశీదు వెనుక ‘తన చావుకు ఎవరు కారణం కాదు ప్రత్యేకహోదా మనహక్కు’ అని సూసైడ్ నోట్ రాసి, వేకువజామున తల్లిదండ్రులు విధులకు వెళ్ళడంతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శనివారం వేకువజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని రెండవ పట్టణ సిఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.