క్రైమ్/లీగల్

అక్రమ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఇథ్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: మోసపూరిత, అక్రమ ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరిని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాచకొండ కమిషనరేట్ అదనపు డిసిపి ఎస్‌ఓటి సయ్యద్ రఫీఖ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేటలో నివాసం ఉండే చిలకల వెంకన్న (49), అదే ప్రాంతానికి చెందిన బోయపల్లి ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాము, ప్రవీణ్‌కుమార్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడం, అందుకు గ్యారంటీగా ఆస్తి పత్రాలు తీసుకోవడం, ఎటిఎం కార్డులు తీసుకుని తమ వద్ద ఉంచుకోవడం వంటి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందడంతో వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించినా, అంతకు ముందు తీసుకున్న బ్లాంక్ చెక్కులు తిరిగి ఇవ్వకపోవడం, రుణాల కోసం వచ్చే మహిళలను వేధించడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందడంతో నిందితులపై చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతకు ముందే నిందితులపై చైతన్యపురి, ఎల్‌బి నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు అదనపు డిసిపి తెలిపారు. నిందితులతో పాటు అక్రమ ఫైనాన్స్ వ్యాపారానికి చెందిన పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటితో సహా నిందితులను వనస్ధలిపురం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ జి.నవీన్ కుమార్, వనస్ధలిపురం ఇన్‌స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణ, ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.