క్రైమ్/లీగల్

లంచం కేసులో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు రెండేళ్ల జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: లంచం తీసుకున్న కేసులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరికి అవినీతి కేసుల ప్రత్యేక న్యాయస్ధానం రెండేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. అవినీతి నిరోధక శాఖ డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం డిసిఆర్‌బిలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న చాట్ల విజయకుమార్ 2009లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక కేసులో అధికారికంగా సహాయ పడేందుకు గాను రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా రెడ్‌హేండెడ్‌గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఆ కేసు విచారణ ఇప్పటి వరకు కొనసాగింది. గురువారం ప్రత్యేక న్యాయస్ధానం నిందిత అధికారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమాన విధించింది.