క్రైమ్/లీగల్

వృద్ధురాలిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 29: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి 70 ఏళ్ల వయసున్న లక్ష్మమ్మపై అదే గ్రామానికి చెందిన పెద్దన్న(35) శనివారం అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూశాయి. లక్ష్మమ్మ ఒడ్డుపల్లి ఎస్సీ కాలనీలో ఒంటరి జీవనం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేని స్థితిలో కాలం గడుపుతోంది. శనివారం సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గ్రహణ కాలంలో చీకటి అలుముకున్న వేళ పెద్దన్న ఇంటిలోకి చొరబడి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు విషమ పరిస్థితిలో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న సీఐ శివనారాయణస్వామి ఒడ్డుపల్లి చేరుకుని వివరాలు సేకరించి నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.