క్రైమ్/లీగల్

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 30: నల్లగొండ పట్టణంలోని రామగిరి సెంటర్‌లో ఉన్న ఎస్టీ బాలుర హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం కలకలం రేపింది. తిరుమలగిరిసాగర్ మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ధరావత్ రంగ (16) పట్టణంలోని ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రంగ కళాశాలకు వెళ్లివచ్చిన తదుపరి సాయంత్రం 5 గంటలకు పురుగుల మందు తాగి హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్థిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రంగ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ముందు రోజు తల్లిదండ్రులతో గొడవపడి గ్రామం నుండి హాస్టల్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనపై టూటౌన్ ఎస్సై అజయ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.