క్రైమ్/లీగల్

కౌన్సిలర్ భర్త.. ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 30: నల్లగొండ మున్సిపాల్టీలోని 21వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ షాహీన్ భర్త టకీ మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. తన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు అభివృద్ధికి మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులు నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షాహీన్, టకీలు పలువురు వార్డు ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆందోళన సాగుతున్న క్రమంలో ఆకస్మాత్తుగా టకీ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పక్కనే ఉన్న వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. టకీ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించగా పలువురు కౌన్సిలర్లు అక్కడి చేరుకుని టకీ ఆందోళనకు మద్దతు పలికారు. ఈవిషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ వెంటనే అక్కడికి చేరుకుని షాహీన్, టకీలను సముదాయించి నిధుల విడుదలపై హామీ ఇచ్చి వారిని ఆందోళన విరమింపచేశారు.