క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పొలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులకథనం ప్రకారం గుడివాడకు చెందిన శంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1 వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు అతనిని ఢీ కొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు రెండు బెల్టు షాపులను తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బెల్ట్ షాపు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.