క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, జూలై 31: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వి అప్పాపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన నక్కా చంద్రారెడ్డి (30) నూ జెండ్లకు పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళ్లాడు. పనులు ముగించుకుని స్వగ్రామమైన అప్పాపురం వెళ్తున్న సమయంలో మార్గమద్యలోని ఎన్‌ఎస్పీ కెనాల్ ఫెన్సింగ్ రాళ్లను ద్విచక్రవాహనం అదుపుతప్పి డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో చంద్రారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రున్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్సానంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు ఆసుపత్రి సిబ్బంది చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని భార్య ఏడు నెలల గర్భిణి.