క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట,ఆగస్టు 4: మండలంలోని నారాయణవలస గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి ఒకరు దుర్మరణపాలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటబొమ్మాళిమండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన ముద్దాడ సింహాచలం(50)క్రిమిసంహారక మందుల కంపెనీలో సేల్స్ రిప్రజెంటివ్‌గా పనిచేస్తున్నాడు. తన విధి నిర్వహణలో భాగంగా రైతులను కలిసేందుకు గాను కంబకాయ గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా తన ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో బోల్తాపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణస్వామి తెలిపారు.